తెలంగాణలో చలి పంజా విసురుతోంది. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.