తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు తెలుస్తాయని అని వెల్లడించారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లాభం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ క్లారిటీ ఇచ్చారు. ఫార్ములా-ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేసారు.