విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజాలో వాహనదారులపై టోల్ మోత మోగుతోంది. వాహనదారులు ఎన్ని సార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్ భారం పడుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్‌ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో గత అక్టోబర్ నుంచి కొత్త నిబంధనల ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్ర భారం పడుతోంది.