Homeహైదరాబాద్latest Newsరైలు టికెట్లు ఈజీగా బుక్ చేయాలనీ చూస్తున్నారా.. ఈ బెస్ట్ యాప్స్ మీ కోసం..!

రైలు టికెట్లు ఈజీగా బుక్ చేయాలనీ చూస్తున్నారా.. ఈ బెస్ట్ యాప్స్ మీ కోసం..!

క్రిస్మస్ మరియు న్యూ ఇయర్‌తో పాటు సెలవుల సీజన్ వచ్చేసింది. అయితే చాలా మంది శీతాకాలపు సెలవుల్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారు, రైలు టిక్కెట్‌లను బుక్ చేయడంలో ఈ బెస్ట్ యాప్స్ వినియోగిస్తే తప్పకుండా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. .
IRCTC రైల్ కనెక్ట్ : భారతీయ రైల్వేల అధికారిక యాప్. దీని ద్వారా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. కోచ్ వివరాలు, బెర్త్ నంబర్ మొదలైనవాటిని ఎంచుకోవడం ద్వారా కూడా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
భారతీయ రైల్వే UTS : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే UTS (అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌ను తీసుకొచ్చింది. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ల బుకింగ్‌తో పాటు, మీరు సాధారణ టిక్కెట్లు మరియు నెలవారీ సీజనల్ టిక్కెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక్సిగో (Ixigo) : ఈ యాప్ ద్వారా రైలు టిక్కెట్లతో పాటు విమానాలు, హోటళ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా రైలు ట్రాకింగ్, లైవ్ అప్‌డేట్‌లు మొదలైనవాటిని కూడా తెలుసుకోవచ్చు. PNR స్టేటస్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా రైలు వాస్తవ స్థితిని పొందడానికి ఈ యాప్ సహాయపడుతుంది.
MakeMyTrip : ఈ MakeMyTrip ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన యాప్. ఇందులో ట్రిప్ గ్యారెంటీ అనే ఫీచర్ ఉన్నందున, టికెట్ కన్ఫర్మ్ చేసినట్లుగా బుక్ చేయబడుతుంది. టికెట్ రద్దు చేయబడితే, మీరు మీ డబ్బుతో పాటు కూపన్లు వంటి ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఎక్కువ మంది వాడుతున్న యాప్స్ లో చెప్పుకోదగ్గ యాప్ ఇదే అని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img