Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ సక్సెస్‌.. బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..!

‘పుష్ప 2’ మూవీ సక్సెస్‌.. బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్‌తో రష్మిక మందన్న బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ కొట్టేసింది. 2012 రొమాంటిక్ హిట్ ‘కాక్‌టెయిల్’ సినిమా సీక్వెల్‌లో షాహిద్ కపూర్‌తో కలిసి రష్మిక మందన్న నటించడం ఖాయమని వర్గాలు వెల్లడించాయి. గతంలో సైఫ్ అలీఖాన్ పోషించిన పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు మరియు ఇద్దరు హీరోయిన్లు అతనితో జతకట్టనున్నారు.వారిలో ఒకరు రష్మిక మందన్న అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Recent

- Advertisment -spot_img