మన దేశాన్ని అనేక రాజ కుటుంబాలు పాలించాయి. అయితే వారందరిలో బరోడా రాజ కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రాజ కుటుంబం ఆధ్వర్యంలోనే 1880లో బరోడాలో లక్ష్మీ విలాస్ పేరిటా ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెజ్ నిర్మించబడింది. ఈ ప్యాలెస్ 170 గదులతో 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. నివేదికల ప్రకారం ఈ రాజకుటుంబానికి రూ.20వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయి.