ఎయిర్ పోర్ట్ లో ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కు వెళ్తుండగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి వెళ్తుండగా… వారిని ఫొటోలు, వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. అయితే తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని విరాట్ కోహ్లి ఓ మహిళా జర్నలిస్టుతో గొడవకు దిగారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.