చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్సయ్యింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుమారు రూ.430 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ టెర్మినల్ ఈ నెల 28న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్ భవనంలో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.