Homeహైదరాబాద్latest Newsనన్ను గెలికారు.. ఇండస్ట్రీ పతనం మొదలైంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

నన్ను గెలికారు.. ఇండస్ట్రీ పతనం మొదలైంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

వేణు స్వామి సోషల్ మీడియా ద్వారా సినీ ప్రముఖులు, రాజకీయ నేతల జాతకాలు చెప్పి బాగా పాపులర్ అయ్యాడు. అయితే సెలబ్రిటీలు జాతకాలు చెప్పడంతో అతను చిక్కులో పడ్డాడు. దీంతో ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పను అంటూ వేణు స్వామి సంచలన ప్రకటన చేసాడు. తాజాగా మరోసారి చాలా యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామిని గెలికినప్పటి నుంచే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కలకలం మొదలయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఎన్‌క్లేవ్‌ హాలును హైడ్రా కూల్చివేయడం, మోహన్ బాబు వివాదం, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. ఇలా తదితర అంశాలు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ గింగిరాలు తిరుగుతుంది చెప్పవచ్చు.. నేను ఎప్పుడో ఆగస్టులోనే ఇదంతా చెప్పా..ఇంకా చాలా జరుగుతాయి అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. వచ్చే ఏడాది కూడా.. 2025 మార్చిలో కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంఘటనలు జరుగుతాయని వేణు స్వామి షాకింగ్ జోస్యం కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img