కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంకు నినాదం ప్రకారం బ్యాంకుల విలీనం కారణంగా నాలుగు రోజులు TGB సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన TG బ్రాంచ్లు విలీనం కానున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు తమ శాఖాపరమైన, ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని TGB తెలిపింది. 27లోగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలంది.