Homeహైదరాబాద్latest Newsమాదాపూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం

మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్య భవనంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. తక్కువ వ్యవధిలోనే ఐదు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో ఐటీ కంపెనీల ఉద్యోగులు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img