మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. “సీఎం జిల్లాకి వస్తున్నారంటే ఆడబిడ్డగా మాకేమైన వరాలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. నెలకు 2500, తులం బంగారం ఇస్తాడేమో అని మహిళలు అనుకున్నారు. కానీ ఏమీ లేదని ఆమె అన్నారు. పింఛన్ 4 వేలు ఇస్తామన్నారు.. ప్రతి 18 ఏళ్ల ఆడపిల్లకు స్కూటీ ఇస్తామన్నారు. మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ” అని కవిత ఆరోపించారు.