ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. రూపాయి మొదలుకొని వేల రూపాయల వరకు దీన్ని వినియోగించి లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 2025 నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకుముందు యూపీఐ 123 చెల్లింపు పరిమితి రూ. 5,000, కానీ ఇప్పుడు దానిని రూ. 10,000. ఇంకా, UPI 123 చెల్లింపులకు సర్వీస్ ఛార్జీ లేదు.