Homeహైదరాబాద్latest News18 ఏళ్ల సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహేష్ బాబు.. ఏంటో తెలుసా..?

18 ఏళ్ల సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన మహేష్ బాబు.. ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన 18 ఏళ్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేసాడు. సాధారణంగా మహేష్ బాబుకి తన సినిమాల లాంచ్ వేడుకలకు దూరంగా ఉండటం అలవాటు. తన చివరి సినిమా ‘గుంటూరు కారం’ కోసం కూడా మహేష్ పూజకు హాజరుకాలేదు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలైన ‘అతిధి’ సినిమా కోసం మహేష్ బాబు చివరిసారిగా తన సినిమాల ప్రారంభోత్సవానికి వెళ్లాడు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాజమౌళి సినిమా కోసం మహేష్ అడుగు పెట్టాడు.అయితే ఈ సినిమా వేడుకకు సంబంధించిన ఎలాంటి విజువల్ ఫుటేజీ సోషల్ మీడియాలో కనిపించకుండా చిత్రబృందం ప్లాన్ చేసింది.

Recent

- Advertisment -spot_img