టెన్త్ పాస్ అయినవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.
హైదరాబాద్లో 57 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అప్లై చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://rbi.org.in/ లేదా
https://opportunities.rbi.org.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన తేదీలు
నోటిఫికేషన్ విడుదల- 2021 ఫిబ్రవరి 24
దరఖాస్తు ప్రారంభం- 2021 ఫిబ్రవరి 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
టెస్ట్ ఫీజు చెల్లింపు- 2021 ఫిబ్రవరి 24 నుంచి 2021 మార్చి 15
ఆన్లైన్ టెస్ట్- 2021 ఏప్రిల్ 9, 10