గత ఏడాది ‘భీష్మ’తో భారీ విజయాన్ని అందుకున్న నితిన్.. ఆ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ‘చెక్’ మూవీ ఒకటి. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
‘భీష్మ’ వంటి భారీ హిట్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న చిత్రం ‘చెక్’.
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు.
ఇందులో నితిన్ చెస్ ప్లేయర్‌గా నటించాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
‘చెక్’ మూవీని ప్రారంభంలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ, ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరిగాయి.
అప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ కారణంగానే ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500లకు పైగా థియేటర్లలో విడుదల అవుతోంది.
‘చెక్’ మూవీని ప్రీమియర్ షోలు, స్పెషల్ షోల ద్వారా చాలా మంది ఇప్పటికే చూసేశారు. ఈ మూవీ అద్భుతంగా ఉందని ఈ మూవీపై తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
‘చెక్’ సినిమా ఎప్పుడైతే ప్రకటించారో.. అప్పటి నుంచో డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గురించి మాట్లాడడం ప్రారంభించారు.
మూవీలో కూడా చందూ దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపించిందట. ఆయన స్టోరీ నేరేషన్, స్క్రీన్‌ప్లే అదరగొట్టేశాడని సినిమాను చూసిన వాళ్లందరూ చెబుతున్నారు.
ఈ సినిమాలో హీరో నితిన్ అదరగొట్టేశాడని ప్రేక్షకులంతా అంటున్నారు.
మరీ ముఖ్యంగా కొన్ని సున్నితమైన సన్నివేశాల్లో అతడు ఎంతో పరిణితితో నటించాడని చెబుతున్నారు.
చెక్ లో నటుడిగా నితిన్‌కు మంచి మార్కులు కొట్టేశాడు.
ఇక, రకుల్, ప్రియా ప్రకాశ్, సంపత్‌లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారట.
ఈ సినిమాలో కథ, డైరెక్టర్ పనితీరు, నితిన్ యాక్టింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, ట్విస్టులు హైలైట్‌గా ఉన్నాయని అంటున్నారు.
మొత్తానికి అందరూ కలిసి చూసే సినిమా అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాకు ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు 3.5/5 రేటింగ్ ఇచ్చారు.