Homeఆంధ్రప్రదేశ్ప్రైవేటు కంపెనీకి ఇసుక తవ్వకాలు

ప్రైవేటు కంపెనీకి ఇసుక తవ్వకాలు

ఇసుక మైనింగ్ అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇసుక రీచ్ ల్లో తవ్వకాల బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఇసుక తవ్వకాల బాధ్యతలు చేజిక్కించుకుంది. ఇసుక అమ్మకాల బాధ్యతను కూడా ఈ సంస్థే దక్కించుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా వున్న ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించిన ఎంఎస్ టీసీ ఆ మేరకు వేలం నిర్వహించింది. రెండేళ్ల కాలవ్యవధి వర్తించేలా ఇసుక తవ్వకాలకు బిడ్డింగ్ చేపట్టారు. వేలంలో మూడు ప్యాకేజీలను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కైవసం చేసుకుంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఏడాదికి రూ.765 కోట్ల ఆదాయం రానుందని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img