హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి పీఆర్సీపై ప్రకటన చేశారు. ఉద్యోగులకు 80) శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. కరోనా, ఇతర పరిస్టితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా సీఎస్ కమిటీ చర్చించిందని గుర్తుచేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమైందని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీఎన్‌జీవో సంస్థ పేరు మార్చుకోలేదని కొనియాడారు. టీఎన్‌జీవో పేరు కూడా ఒక స్ఫూర్తి అని ప్రశంసించారు.
Read this news also…
అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!
క్లాక్ టవర్ల చరిత్ర తెలుసా.. వీటి వెనుక స్వార్థం ఏంటి..
వీఆర్సీ ప్రకటనలోని ముఖ్యాంశాలు…
- ప్రభుత్వ ఉద్యోగ. ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు, హోంగార్డులకు పీఆర్సీ వర్తింపు
- అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్హు కేబీబీవీ సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు పీఆర్సీ
- పదవీ విరమణ వయో పరిమితి 61 ఏళ్లకు పెంపు. ఈ పెంపు తక్షణమే వర్తింపు.
- ఉద్యోగులు కోరిన విధంగానే పదోన్నతుల ప్రక్రియ. 80 శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి. అర్హులైన
- ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు. ఈ ప్రక్రియ సత్వరమే ప్రారంభం.