Homeసినిమానెట్టింట 'ఇన్‌స్టా' రీల్‌తో సమంత హల్‌చల్

నెట్టింట ‘ఇన్‌స్టా’ రీల్‌తో సమంత హల్‌చల్

ఫ్యాషన్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌​ స్టార్‌ హీరోయిన్‌ సమంత.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్‌ బిజినెస్‌లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘సాకి’ పేరుతో లాంఛ్‌ అయిన ఈ క్లోతింగ్‌ బ్రాండ్‌ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయ్యింది.

దీంతో ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది.

‘సాకి’ ఆన్‌లైన్‌ స్టోర్‌కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తున్నాయిని, దీంతో అ‍మెరికా, సింగపూర్‌, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్‌ చేస్తున్నట్లు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను ఎప్పటిలాగే కొత్తగా ఆవిష్కరించింది.

‘సాకి’​ బ్రాండ్‌కు చెందిన దుస్తులను  అద్దం ముందు నిలబడి  ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది.

‘ఇన్‌స్టా’ రీల్‌తో మరింత అందంగా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే లైక్స్‌ వచ్చాయి.

‘సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్‌ సామ్’‌ అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో  ‘శాకుంతలం’ అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్‌గా లాంఛ్‌ అయింది.

ఇందులో టైటిల్‌ రోల్‌ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది.

 

 

Recent

- Advertisment -spot_img