ICC Champions Trophy 2025: మరో నాలుగు రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సారి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ భారీగా పెంచేశారు. గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ప్రైజ్ మనీని ఏకంగా 53% పెంచారు. ఈసారి ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు 2.24 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.20 కోట్లు అందనున్నాయి. అలాగే రన్నరప్‌గా నిలిచే జట్టు దాదాపు రూ.10 కోట్లు గెలుచుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.
ప్రైజ్ మనీ వివరాలు ఇవే:
- విజేత ప్రైజ్ మనీ: రూ.20.8 కోట్లు.
- రన్నరప్ ప్రైజ్ మనీ: రూ.10.4 కోట్లు.
- సెమీ-ఫైనలిస్ట్ ప్రైజ్ మనీ: ఒక్కో జట్టుకు రూ.5.2 కోట్లు.
- ఐదవ మరియు ఆరవ స్థానంలో నిలిచిన జట్లు: రూ.3 కోట్లు.
- ఏడవ మరియు ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లు: రూ.1.2 కోట్లు.
- ఒక్కో మ్యాచ్‌కు ప్రైజ్ మనీ: రూ.29 లక్షలుగా ఐసీసీ ప్రకటించింది.