తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఆరు జిల్లాల్లోని 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల్లో లోపాలను గుర్తించి వారికి టీచర్లు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.