Homeఫ్లాష్ ఫ్లాష్Pakistan vs Bangladesh: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు.. ఒక విజయం కూడా లేకుండానే ట్రోఫీ నుండి...

Pakistan vs Bangladesh: పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు.. ఒక విజయం కూడా లేకుండానే ట్రోఫీ నుండి పాక్ అవుట్..!

Pakistan vs Bangladesh: వర్షం కారణంగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు చేయబడింది. పాక్‌లోని రావల్పిండిలో ఇవాళ జరగాల్సిన పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మధ్యాహ్నం 2గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. వాన కారణంగా ఇప్పటివరకు టాస్ వేయలేదు. గ్రూప్-Bలో వర్షం కారణంగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు అయ్యిన విషయం తెలిసిందే. గ్రూప్-Aలో భారత్, కివీస్ సెమీస్‌కు వెళ్లిన నేపథ్యంలో నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ప్రేక్షకులు కూడా స్టేడియానికి పెద్దగా రాలేదు. రావల్పిండిలో భారీ వర్షంతో మైదానం పూర్తిగా తడవడం అంపైర్లు మ్యాచ్ నురద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లు చెరో పాయింట్ తమ ఖాతాలో వేసుకున్నాయి. ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ముందే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ దారుణమైన ప్రదర్శనతో ఒక మ్యాచ్ లో కూడా విజయం సాధించలేక ఇంటి దారి పట్టిన పాక్ అభిమానులకు నిరాశే మిగిలిచిందనే చెప్పాలి.

Recent

- Advertisment -spot_img