Homeఫ్లాష్ ఫ్లాష్AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఆస్ట్రేలియాను ఆఫ్ఘన్...

AUS vs AFG: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఆస్ట్రేలియాను ఆఫ్ఘన్ జట్టు మరోసారి ముప్పుతిప్పలు పెడుతుందా..?

AUS vs AFG: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘన్ జట్టు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ఆఫ్ఘన్లు తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఇప్పుడు, లీగ్ దశలో సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఫ్ఘనిస్తాన్ నేడు ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. మాక్స్‌వెల్ ప్రదర్శనతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకున్నారు. నేడు జరిగే ఛాంపియన్‌షిప్‌లో రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ కఠినమైన ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుందో లేదో చూడాలి. ఇంగ్లాండ్‌ను ఓడించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే మంచి ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్లు లేకపోవడం ఆఫ్ఘనిస్తాన్ కలిస్తోందని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img