Half day schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటిపూట బడుల (Half day schools) నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం హాఫ్ -డే స్కూల్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.