Intermediate : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుండి ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని వెల్లడించారు. ఫస్ట్ మరియు సెకండ్ ఇంటర్ మరియు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్/SSC హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 5న ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్షలు 24వ తేదీతో ముగియనున్నాయి. అదేవిధంగా మార్చి 6న ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ పరీక్షలు 25వ తేదీ వరకు జరగనున్నాయి.