Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయి. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, ఆస్ట్రేలియాతో తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడి టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. కానీ అతని స్థానంలో బలమైన ఆటగాడిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ షార్ట్ స్థానంలో మరో ఆటగాడిని ప్రకటించింది. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలీని ఆసీస్ జట్టులోకి తీసుకున్నారు. కూపర్ కొన్నోలీ మంచి ఆల్ రౌండర్.. కూపర్ కొన్నోలీ స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ నైపుణ్యం కలిగినవాడు.