Steve Smith Announces Retirement: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే స్టీవ్ స్మిత్ 170 వన్డేల్లో ఆడాడు. 43.28 సగటుతో 5800 పరుగులు చేసాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా స్మిత్ కెరీర్‌ను ముగించాడు. స్మిత్ అత్యధిక స్కోరును 2016లో న్యూజిలాండ్‌పై 164 పరుగులుచేశాడు. లెగ్‌స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌గా అరంగేట్రం చేసిన అతను 28 వికెట్లు కూడా తీసుకున్నాడు. వన్డేల్లో 90 క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే టెస్టులు, టీ20లలో కొనసాగుతానని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ దశలో ఆస్ట్రేలియా ఒకే ఒక్క పూర్తి మ్యాచ్ ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా మధ్యలో రద్దు అయింది. వారు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే గెలిచారు. సెమీ-ఫైనల్స్‌లో టీం ఇండియా చేతిలో ఓడిపోయి ఇంటికి దారి పట్టారు.