ICC Champions Trophy Pitch: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కథ క్లైమాక్స్ కు చేరుకుంది. రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ట్రోఫీ ఎలాగైన ముద్దడాలని టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే మైదానంలో చెమటలు చిందిస్తున్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. లీగ్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్‌ను ఫైనల్ కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్ స్టేడియంలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ పిచ్ కూడా దాదాపు స్పిన్నర్లుకు అనుకూలంగానే ఉంటుంది.