Homeహైదరాబాద్latest NewsChampions Trophy Final: ఫైనల్ కి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లికి గాయం..!

Champions Trophy Final: ఫైనల్ కి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లికి గాయం..!

Champions Trophy Final: క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఈ ఫైనల్‌లో అగ్రశ్రేణి జట్లు న్యూజిలాండ్, ఇండియా తలపడతాయి. ఈ మ్యాచ్ రేపు దుబాయ్‌లో జరుగుతుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. తుది సమరానికి ముందు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయపడ్డారు. ప్రాక్టీస్ లో పేసర్ ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి మోకాలికి గాయమైంది. దీంతో వెంటనే ట్రైనింగ్ ఆపేశారని, ఫిజియో స్ప్రే కొట్టి, బ్యాండేజ్ వేశారని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img