Sri Chaitanya College : ప్రముఖ విద్యాసంస్థ శ్రీ చైతన్య కాలేజీలపై (Sri Chaitanya College) ఐటి దాడులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకొని ట్యాక్స్ను ఎగ్గొట్టినట్లు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ – మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ హెడ్ క్వార్టర్స్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.