Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలో 5 స్థానాల్లో మూడు తెలుగుదేశం పార్టీకి, ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బిటి నాయుడు, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఐదు స్థానాలకు కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఈ ఐదు స్థానాలు ఏకగ్రీవం ఎన్నిక అయ్యారు.