ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. ‘స్పౌజ్ పింఛన్’ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ప్రకారం, ఒక పెన్షనర్ మరణిస్తే, అతని జీవిత భాగస్వామికి తదుపరి నెల నుండి పెన్షన్ అందుతుంది.. అలాగే పింఛన్ బదిలీకి కూడా అవకాశం కల్పించనుంది. . దీనితో రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.