బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు కుర్రకారు మతులు పోగొట్టేలా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ భామ మాల్దీవులు వెకేషన్ లో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న స్టిల్ ఒకటి ఊపిరాడకుండా చేస్తోంది.
బికినీ వేర్లో ఉన్న దిశాపటానీ సూర్యకిరణాల నుంచి వచ్చే తాపానికి చెక్ పెడుతూ..బీచ్‌లో షికార్లు చేసింది.
కరోనా సెకండ్ వేవ్ మరిచిపోయేలా మాల్దీవులు టూర్‌ను తెగ ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
ఓ వైపు సముద్ర చందాలు, మరోవైపు అందాలు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న స్టిల్ చూపు పక్కకు తిప్పకోనీయకుండా చేస్తోంది.
దిశాపటానీ తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాప్‌తో హాలీడే ను సరదాగా గడుపుతోంది.
ఇటీవలే మాల్దీవులకు వెళ్లేముందు దిశా-టైగర్ ఎయిర్ పోర్టు వద్ద కనిపించిన ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి.