‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పెట్టె లపై, సినిమా హాల్లలో, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించినా పొగ తాగే వారు ఏటా పెరుగుతూనే ఉన్నారు.
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయని తెలిసిన మానడం లేదు.
తాజాగా సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పొగతాగే వారి పై పరిశోధనలు చేశారు.
వీరి అధ్యయనాన్ని ‘ఈ-క్లినికల్ మెడిసన్’ జర్నల్లో ప్రచురించారు.
వీరి రీసెర్చి ప్రకారం.. రెగ్యులర్ స్మోకింగ్ చేసే వారు ఇరవై ఎనిమిది రకాల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు.
క్యాన్సర్, శ్వాస, గుండె సంబంధిత వ్యాధు లతోపాటు మూత్ర పిండాల వైఫల్యం, న్యుమోనియా, కంటి సమస్యలు, రక్తం విషతుల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చి ప్రమాదం ఉందని తేల్చారు.
అదేవిధంగా పొగ తాగేవారు 10 సంవత్సరాల ముందుగానే చనిపోతున్నారని పేర్కొన్నారు.
స్మోకింగ్ చేయని వారితో పోల్చితే 30 శాతం మంది అధికంగా ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు రీసెర్చిలో వెల్లడించారు.
ఈ రీసెర్చ్ కోసం లక్షల 52 వేల 483 మందిని ఎంపిక చేసి వారిని మూడు కేటగిరీలుగా విభజించారు.
రోజుకు పది సిగరెట్లు తాగే వారిని ఒక క్యాటగిరిగా, 20లోపు తాగే వారిని మరో కేటగిరిగా, 20కి పైగా తాగే వారిని మూడో క్యాటగిరిగా విభజించి వారిపై అధ్యయనం చేశారు.
అదే సమయంలో ప్రపంచ జనాభాలో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 20 శాతం మంది పొగ తాగుతున్నట్లు పరిశోధనకు ప్రాతినిధ్యం వహించిన యూనివర్సిటీ ప్రొఫెసర్ హెలీనా పేర్కొన్నారు.