కరోనా రోజురోజుకూ విజృంభిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందోనని భయపడుతున్నారు చాలామంది.
ఆక్సిజన్, బెడ్లు, రక్తం, ప్లాస్మా అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు కొవిడ్ బాధితులు.
తన తల్లి విషయంలో ఈ బాధను అనుభవించి, హాస్పిటల్స్‌లోని పడకల వివరాలు తెలిపేలా ఓ యాప్‌ని క్రియేట్ చేసింది హైదరాబాద్‌కు చెందిన వెన్సీ కృష్ణ.
కొన్నిరోజుల క్రితం వెన్సీ తల్లికి కరోనా అని నిర్ధారణ అయింది. ఆ సమయంలో హాస్పిటల్ బెడ్ దొరక్క ఇబ్బంది పడింది.
చివరకు ఎలాగోలా ఆమె తల్లి కొవిడ్‌ను జయించగలిగింది.
ఈ అనుభవంతో హైదరాబాద్‌లోని ఏ హాస్పిటల్లో, ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం అందరికీ తెలియచేయాలి అనుకుంది.
అందుకు ఓ యాప్ క్రియేట్ చేసింది. అనుకున్న రెండు గంటల్లో ఈ యాప్‌ని రూపొందించింది.
hydcovidresources పేరుతో ప్రారంభించిన ఈ యాప్‌ని కేవలం ఐదు రోజుల్లోనే రెండు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.