ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వింత పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆన్‌లైన్ పరిచయం ప్రేమగా మారింది. అయితే యువతి వయసు 25 సంవత్సరాలు కాగా, యువకుడి వయసు కేవలం 16 సంవత్సరాలే. మైనర్. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని ఆమె పట్టుబడుతోంది. దీంతో పోలీసులకు, వాళ్ల కుటుంబాలకు చిక్కులు ఏర్పడ్డాయి.
ఈ ఘటన రాష్ట్రంలోని మీరట్‌లో చోటు చేసుకుంది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం పోలీసులకు విచిత్రమైన పరిస్థితుల్లోకి నెట్టింది.
సోషల్ మీడియాలో యువతికి, అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. షామ్లీలోని మైనర్ కుటుంబం మాట్లాడుతూ.. సదరు యువతి గత కొన్ని రోజులుగా తమ ఇంట్లోనే ఉంటుందని, తమను విడిచిపెట్టాలని అడిగినప్పుడు, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని చెప్పింది. బాలుడి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు మొదటగా స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతో ఈ కేసు జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు చేరింది.
నా కొడుకు చదువుకోలేదు, ఏ పని చేయడు, సోషల్ మీడియాలో మహిళతో స్నేహం చేశాడు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఉంటూ వెళ్లిపోవాలని కోరినప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది” అని బాలుడి తండ్రి చెప్పారు. సదరు మహిళను ఆమె బంధువులకు అప్పగించి ఇంటికి పంపించామని, అయితే ఆమె మళ్లీ తిరిగి వచ్చిందని, దీంతో ఆమె తమ కుటుంబం పేరును నాశనం చేస్తుందని, వారితో ఉండేందుకు కుటుంబం నిరాకరించిందని పోలీసులు వెల్లడించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (కైరానా) వీరేంద్ర కుమార్ బుధవారం మాట్లాడుతూ.. ఇది మాకు విచిత్రమైన పరిస్థితి, మహిళ మైనర్‌తో ఉంటానని పట్టుబట్టింది. ఆమెను పోలీసు మహిళా సంక్షేమ విభాగానికి అప్పగించాము. అయితే, ఆమె అక్కడ నుంచి తిరిగి వచ్చింది. ఆమె తల్లిదండ్రులను స్టేషన్‌కి పిలిపించామని చెప్పారు.