ఇదే నిజం, జగిత్యాల జిల్లా ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ధరూర్‌కు చెందిన మూడో తరగతి బాలుడు బాలే హర్షిత్(9) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబంతో కలిసి తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న అనంతరం తీవ్ర అస్వస్థకు గురైన బాలుడుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. చిన్న వయసులోనే హర్షిత్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబీకుల శోకసంద్రంలో మునిగిపోయారు.