తన అరెస్ట్ పై వస్తున్న వార్తలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ట్విట్ చేసారు. నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసు లోనే ఉన్నాను అని తెలిపాడు. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియా తో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసు లోకి ఎందుకు రారు? అని ఆర్జీవీ ప్రశ్నించారు.
నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు , ఆంధ్రప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు అని తెలిపారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి అని అన్నారు. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం నా కేసు విషయం లో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేసారు.