టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సమంతలు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల దంపతులు విడిపోయారు. సమంత విడాకులు తీసుకున్న కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య, శోభితలతో ఆమె రిలేషన్ షిప్ గురించి గాసిప్స్ హల్ చల్ చేసాయి. ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అతికొద్ది మంది అతిథుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. శోభిత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శోభిత నాగ చైతన్యతో తన రిలేషన్ షిప్ కంటే ముందు ఆమె వేరొకరితో డేటింగ్ చేసిందని.. అవును నటి శోభిత ఫ్యాషన్ డిజైనర్ తో రిలేషన్ షిప్ లో ఉందనే వార్త హల్ చల్ చేస్తోంది. అంతే కాదు వారి రిలేషన్ షిప్ సమయంలో వారితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన కొద్ది రోజులకే ఈ ఫోటో బయటకు రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. శోభిత ధూళిపాళ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. నాగ చైతన్య నటిస్తున్న తాండలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది.