పాత ఐఫోన్ మోడళ్లలో త్వరలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయని వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయం 2025 నుంచి అమల్లోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది.ఐఓఎస్ 15.1 కంటే ముందున్న ఓఎస్ వెర్షన్లలో పనిచేసే ఐఫోన్లపై ప్రభావం పడనుంది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6 మరియు 6 Plus మోడల్‌లలో వాట్సాప్ సేవలు నిలిపివేయబడతాయి. మే 2025 నుండి iOS 15.1 కంటే పాత OS వెర్షన్‌లు నడుస్తున్నఐఫోన్ లలో వాట్సాప్ సేవలు పనిచేయడం ఆపివేస్తాయని కంపెనీ తెలిపింది. అయితే కొత్త ఓఎస్ వెర్షన్‌కు అప్‌డేట్ అయితే వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ వివరాలను వెల్లడించింది. iPhone 5s, iPhone 6 మరియు iPhone 6 Plus మోడల్‌లు గరిష్టంగా iOS 12.5.7 వెర్షన్‌లో మాత్రమే రన్ అవుతాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ మోడళ్ల వినియోగదారులు వాట్సాప్ యాప్‌ను ఉపయోగించలేరు. ఈ కొత్త నిర్ణయం కేవలం ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.