వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ ఇచ్చేందుకు మరో మాజీ మంత్రి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే మేకతోటి సుచరిత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మేకతోటి సుచరిత వైసీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆమెకు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పేరుంది. అయితే ఆమె వైసీపీలోనే ఉంటూ తాడికొండ నుంచి పోటీ చేశారు. అక్కడ ఓటమి పాలైనప్పటి నుంచి సుచరిత సైలెంట్‌గా ఉన్నారు.త్వరలో ఆమె టీడీపీలో కాకుండా జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ ప్రచారంలో ఏమైనా నిజం ఉందంటే సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది.