Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

ACCIDENT: ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

ఇదే నిజం, జోగిపేట: ఆగిఉన్న బస్సును బైక్ ఢీకొన్న ఘనటలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం నాందేడ్ – అకోలా జతాయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘనటకు సంబందించి ఎస్ఐఐ అరుణ్కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం పాపాన్నపేట మండలం మదిరే కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లంపేట రాములు (35) సంగారెడ్డిలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామానికి వెళ్లి పని ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డికి వెళ్తున్న క్రమంలో సంగుపేట గ్రామ రోడ్డు వద్ద జాతీయ రహాదారిపై ఆగి ఉన్న బస్సును బలంగా ఢీకొనడంతో రాములు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హైవే అంబులెన్స్ వాహనం ద్వారా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబందించి ఇప్పటివరకు ఎటువంటి పిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు.

Recent

- Advertisment -spot_img