– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టిలో ఎవరైనా ఓకే
– బీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.
– తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారు
– వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఫలితాలను వెల్లడించాయి. దీంతో తామె అధికారం చేపట్టబోతుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే బ్లాక్ మెయిలర్ మాత్రం సీఎం కావొద్దన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలో ఎవరూ ముఖ్యమంత్రి అయినా పర్వలేదని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌లో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారన్నారు. కానీ వారిలో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవికి అర్హులన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ఆ పార్టీ నేతలు తేల్చుకుంటారన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారన్నారు. ఈ సందర్బంగా బైబై కేసీఆర్ సూటుకేసును ఆమె ప్రదర్శించారు.
కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తున్నరు..
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రూ. 6వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నదన్నారు. రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. భూరికార్డులు మారుస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించడంలేదన్నారు. ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరామన్నారు.