నాగచైతన్య విడాకుల అంశానికి కొనసాగింపుగా నాగచైతన్య శోభిత జాతకం చెప్పానని చెబుతూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ ఉమెన్ కమిషన్ కి వేణు స్వామి మీద ఫిర్యాదు చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి భార్య శ్రీవాణి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఒకపక్క మీడియా దిగజారి పోతుందని అంటూనే మరోపక్క తన భర్త మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారంటూ ఆమె మీడియా సీరియస్ అయింది. ఇది విన్న నెటిజన్లు వేణు స్వామి.. నీ భర్త అయ్యి ఉండొచ్చు కానీ తప్పు చేసినోన్ని సమర్థించడం ఏందీ అని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. “గంతకు తగ్గ బొంత”.. “వేణు స్వామి పెళ్ళాం అనిపించుకుంది గా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.