Homeహైదరాబాద్latest Newsఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు

ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న బంద్‌ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్‌ లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీపంలోని అడవుల్లో పోకలమ్మ వాగు దగ్గర జరిగిన దారుణ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. నవంబర్ 30న, చెల్పాక పంచాయితీలోని వలస ఆదివాసీ గ్రామంలో, ఏడుగురు సాయుధ వ్యక్తులను పట్టుకుని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

Recent

- Advertisment -spot_img