Homeహైదరాబాద్latest Newsమరో డాన్స్ మాస్టర్ పై కేసు నమోదు

మరో డాన్స్ మాస్టర్ పై కేసు నమోదు

ఒకవైపు జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు కావడం పెద్ద చర్చకు దారితీయగా, ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజాపై కూడా కేసు నమోదైంది. రెమో డిసౌజా, అతని భార్య లిజెల్ డిసౌజాతో పాటు మరో ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదైంది. శనివారం ఫిర్యాదు చేసినట్లు ముంబైలోని థానే పోలీసులు తెలిపారు. రెమో, అతని భార్య, ఇతర వ్యక్తులు కలిసి రూ.11.96 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెమో డిసౌజా, అతని భార్య లీజెల్ మరియు మరో ఐదుగురిపై 26 ఏళ్ల డ్యాన్సర్ ఈ ఆరోపణ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. బాధిత డ్యాన్సర్ ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 16న ఫిర్యాదు చేసింది. పోలీసులు రెమో డిసౌజాతో పాటు మరో ఆరుగురిపై సెక్షన్ 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) మరియు ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img