ఇదే నిజం, నల్గొండ టౌన్ : నల్లగొండ -ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా దుప్పలపల్లి హౌసింగ్ వేర్ గోడౌన్స్ నందు కౌంటింగ్ హాల్ – 2 నందు ఎఆర్ఓ గా విదులు నిర్వహిస్తున్న అడిషనల్ కలెక్టర్ కె .వెంకటేశ్వర్లు విదులు నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటింగ్ హాల్ -2 లోకి వచ్చి కౌంటింగ్ సమయం లో సిబ్బంది సరిగా కౌంటింగ్ చేయడం లేదని వాగ్వివాదానికి దిగి తనను బెదిరించి విధులకు ఆటంకం కలిగించాడని కౌంటింగ్ హాల్లో కి అనుమతి లేకుండా వచ్చి విధులకు ఆటంకం కలిగించినందుకు చర్యలు తీసుకోవాలని తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.,