‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ బుధవారం రాత్రి 9.30 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి వచ్చారు. ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాది తిరుపతి వర్మ ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేసారు. BNS యాక్ట్ సెక్షన్ 105, 118 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసారు. హీరో అల్లుఅర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు చేసారు.