ఇదేనిజం,శేరిలింగంపల్లి: కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీయస్ లో లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్ తో పాటు నార్సింగ్ అల్కాపురి టౌన్షిప్ నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. సదరు మహిళ నార్సింగి నివాసి కావడంతో నార్సింగి పోలిస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. అతనిపై ఐపిసి సెక్షన్ 376,(506) (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.