Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి : కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కారు కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. అవినీతి లేనప్పుడు.. కేసు ఎక్కడిది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ తప్పు. జనవరి 7న జరిగే ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయం తీసుకుంటారు అని పేర్కొన్నారు.కోర్టులపై నాకు నమ్మకం ఉంది. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని అన్నారు. నన్ను ఏదో విధంగా జైలుకు పంపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫార్ములా ఈ కేసు 600 కోట్ల సంగతి పక్కన పెడితే.. ఒక్క పైసా అవినీతి జరగలేదు. జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు అని అన్నారు. నాపై కేసు పెడితే.‌. రేవంత్ రెడ్డిపై కూడా కేసు పెట్టాలి.. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img